Sunday, October 26, 2025
ePaper
Homeమేడ్చెల్‌Medchal | జోరుగా అక్రమ నిర్మాణాలు

Medchal | జోరుగా అక్రమ నిర్మాణాలు

  • అనుమతులు ఒకలా నిర్మాణాలు మరోలా..
  • మేడ్చల్ లో ఇష్టారీతిన వెలుస్తున్న భవనాలు..

తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణాల్లో పారదర్శకంగా సేవలు అందిస్తూ నిర్మాణదారులకు తక్కువ కాల వ్యవధిలో అనుమతులు ఇచ్చేలా కొత్త చట్టం తీసుకొచ్చినా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పలువురు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. హెచ్ఎండీ నిబంధనల ప్రకారం జి+రెండు అంతస్తుల భావన నిర్మాణ అనుమతులు తీసుకుని ఇష్టానుసారంగా మూడు, నాలుగు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఒకటి, రెండు అంతస్తుకు అనుమతి తీసుకొని అంతకంటే ఎక్కువ అంతస్తులు, డొమెస్టిక్ అనుమతితో కమర్షియల్ షెటర్లు నిర్మిస్తు ప్రభుత్వ ఖాజానకు భారీగా గండి కొడుతూన్నారు.

అక్రమ నిర్మాణాలు చేస్తున్న వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అటువైపు చూడకుండా పరోక్షంగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు అధ్వెల్లిలో కొందరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు అటువైపు చూడటంలేదని, జి+ రెండు అంతస్తులకు అనుమతి పొంది అదనంగా మరో అంతస్తు నిర్మాణం చేస్తున్న అక్రమాలకు అధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలు దండిగా ఉండటంతో అక్రమ నిర్మాణం జోరుగా కొనసాగుతుందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం:- కమిషనర్ చంద్రప్రకాష్

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు అధ్వెల్లిలో ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా చేపట్టిన భవనం నిర్మాణం పై వస్తున్న ఆరోపణలపై కమిషనర్ స్పందిస్తూ అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భావన యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News