Tuesday, February 10, 2026
Homeబిజినెస్Saving | ఏటా లక్ష రూపాయలు ఆదా అవ్వాలంటే..

Saving | ఏటా లక్ష రూపాయలు ఆదా అవ్వాలంటే..

ఏటా (Yearly) లక్ష రూపాయలు ఆదా (Save) అవ్వాలంటే.. మీరు ప్రత్యేకంగా డబ్బులు (Money) పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. అదనపు సమయం (Extra Time) కష్టపడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ స్టైల్‌(Life Style)ని మార్చుకోకుండానే ఏడాదికి ఏకంగా లక్ష రూపాయలు ఆదా చేసుకునే 5 మార్గాలు.. ప్రతి నెలలో చేసిన అన్ని ఖర్చులను రోజు వారీగా నోట్స్‌లో వివరంగా రాసుకొని మంత్ ఎండ్‌(Monthend)లో ఓసారి గమనిస్తే వేస్ట్‌గా చేసిన వ్యయాలేంటో ఈజీగా తెలిసిపోతుంది. తద్వారా 10 నుంచి 20 శాతం వరకు డబ్బులు మిగులుతాయి. ఓటీటీలు(OTTs), యాప్‌లు(Apps), బ్రాడ్ బ్యాడ్(Broad Band), సెల్‌ఫోన్ రీఛార్జ్‌ల (Mobile Recharge) కోసం నెల వారీ ప్లాన్లకు బదులు వార్షిక చందాలు కడితే వేల రూపాయలు ఆదా అవుతాయి. వారానికి 2 నుంచి 3 వరకు ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ ఆర్డర్లను తగ్గించుకుంటే నెలకు రెండున్నర వేల నుంచి నాలుగు వేల దాక సేవ్ చేయొచ్చు. యూపీఐ లేదా ఫ్యూయెల్ రివార్డ్ యాప్‌లను, ఇ-కామర్స్ ఆఫర్లను, పేమెంట్ యాప్‌లను ఉపయోగిస్తే రివార్డ్‌ల రూపంలో క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఎక్‌స్ట్రా స్పెండింగ్ చేయకుండానే అవసరాలు తీరతాయి. ఎక్కువ వడ్డీ రుణాలను రీఫైనాన్సింగ్ చేయటం ద్వారా మరియు అనవసరమైన ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లను తొలగించటం ద్వారా వార్షిక ఖర్చులకు కోత పెట్టొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News