Friday, February 13, 2026
Homeఆరోగ్యంWeight Loss | బరువు తగ్గాలంటే..

Weight Loss | బరువు తగ్గాలంటే..

బరువు తగ్గటం కోసం చాలా మంది తినటం (Eating) మానేస్తారు. అయితే.. అది సరైన పరిష్కారం కాదు. ఫుడ్డు (Food) తినటం తగ్గిస్తే మొదట్లో కొంచెం బాగానే అనిపిస్తుంది. కానీ.. తర్వాత పెద్దగా మార్పుండదు. భోజనం (Calories) మరీ ఎక్కువ తగ్గిస్తే శరీరం (Body) ఆకలి(hunger)కి తట్టుకోలేదు. ఫలితంగా జీవక్రియల వేగం (Metabolic rate) మందగిస్తుంది. దీంతో కొవ్వు (Fat) పెరుగుతుంది. బరువు తగ్గటం కోసం మందులు (Medicines) వేసుకున్నప్పటికీ ఆ ప్రభావం 20 నుంచి 25 శాతం వరకే ఉంటుంది.

కొన్నాళ్లకు అవి కూడా పనిచేయటం మానేస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ (University of Southern Denmark) పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలుకల (Rats) మీద ప్రయోగాలు చేస్తున్నారు. అవి విజయవంతం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఆ ప్రయోజనాలు కొన్నాళ్లకు మనుషులకు కూడా అందుబాటులోకి వస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News