Tuesday, October 28, 2025
ePaper
Homeఆరోగ్యంParalysis | పక్షవాతం గుర్తించకపోతే ప్రాణాలకు ప్రమాదం

Paralysis | పక్షవాతం గుర్తించకపోతే ప్రాణాలకు ప్రమాదం

మన జీవితాలను మార్చే మౌన ప్రమాదం..!!
80శాతం పక్షవాతాన్ని నివారించవచ్చు…!!
నేడే వరల్డ్‌ స్ట్రోక్‌ డే….
ఫోటోరైటప్‌..సింబలిక్‌ చితర్ర…2,వైద్యుడు.. కే.సాయి సతీష్‌,!న్యూరోలాజీస్టు !

    ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి

ఆధునిక జీవనశైలి (Modern Lifestyle) కలవరపరుస్తోంది.వ్యాధులు చుట్టముడుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా శరీరంపై రోగాలు (Diseas) దాడిచేస్తున్నాయి.తట్టుకునే సామర్థ్యం కూడా తగ్గింది. వచ్చే వ్యాధుల్లో పక్షవాతం(Paralysis) కూడ చేరిపోయింది. వ్యాధిని అవగాహన లేకపోవటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు (Experts) చెబుతున్నారు.మందులు ఉపయోగించకుండా ఆకుపసర్లు మింగుతూ కాలయాపన చేయటం వల్లే శాశ్వతంగా వికలాంగులుగా ఉండాల్సి వస్తుందని ఒక అంచనా.అవగాహానతో నూటికి 80శాతం నివారించవచ్చుని చెబుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా పక్షవాతంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆక్టోబర్‌ 29 ఏటా వరల్డ్‌ స్ట్రోక్‌ డే నిర్వహిస్తున్న సందర్భంగా ఆదాబ్‌ పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం…!!


ఇలా ప్రారంభం….!!


ఛాతి అవగాహన కోసం ఒక ప్రత్యేక దినం సృష్టించే ఆలోచన 1990లో యూరోపియన్‌ స్ట్రోక్‌ ఇనిషియేటివ్‌తో మొదలైంది. అయితే ఆర్థిక పరిమితుల కారణంగా ఈ ప్రయత్నం కేవలం యూరప్‌లో మాత్రమే పరిమితమైంది. అయితే ప్రపంచ స్ట్రోక్‌ డేను ఆక్టోబర్‌ 29నాడు కెనడా వాంకోవర్‌ రాష్ట్రంలో జరిగిన ప్రపంచ ఛాతి కాంగ్రేస్‌లో స్థాపించబడిరది.డాక్టర్‌ వ్లాదిమిర్‌ హాచిన్ని పర్యవేక్షణలో ఒక వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటైంది.అయితే 2006 ఆక్టోబర్‌.దాదాపు ఆదే సమయంలో అంతర్జాతీయ ఛాతి సంస్థ, మరియు ప్రపంచ ఛాతి ఫేడరేషన్‌ విలీనం అయి ప్రపంచ ఛాతి సంస్థ ఏర్పడిరది.ఇది ప్రపంచ ఛాతి దినం నిర్వహాణ స్వీకరిచింది.2009లో డబ్లూ ఎస్‌ వో నాయకత్వం ఒకే ఒక అవగాహన దినంపై దృష్టిపెడుతుంది.


అందుబాటులో అత్యాధునిక వైద్యసేవలు….!!


హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో పక్షవాతం వ్యాధికి అత్యధునిక వైద్యసేవలు అందుబాటులోఉన్నాయి.న్యూరోసర్జన్లు, న్యూరోలాజీస్టులు ఉస్మానియ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారు.అయితే ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కోక డాక్టరువద్దకు 3టూ5 మంది రోగులు వైద్యపరీక్షల నిమిత్తం వస్తారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి 70లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారు. వీరిలో 60లక్షల వరకు మంది సరైన సమయానికి చికిత్సతీసుకోలేనికారణంగా చనిపోతున్నారు.మన భారతదేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు పేరాలసీస్‌ వ్యాధి బారిన పడుతున్నారు.


జాగ్రతలు తప్పనిసరి….!!


కొన్ని సందర్భాల్లో ప్రాణాలు హరించి వేసే పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తపోటను షూగర్‌ను అదుపులోకి పెట్టుకోవాలి. మధ్యపానం, ధూమపానం చేయకుడదు. కోవ్యు పదార్ధాలు అధికంగా తినకూడదు. స్థూలకాయం లేకుండా చూసుకోవడంతోపాటు ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచింది.


వ్యాధి రావడానికి గల కారణాలు ఇవే….!!


మెదడులో వేళ్లే రక్తనాళం గాని మెదడులోని రక్తనాళం గాని పూడుకుపోవటం వలన మెదడుకి రక్త సరఫరా ఆగిపోతే పక్షవాతం వస్తుంది.పక్షవాతం అంటే బ్రెయిన్‌ ఆటాక్‌ హార్టఆటాక్‌ లాగే ఇది చాలా ప్రమాదాకరం.ఇది రావడానికి ప్రధాన కారణం రక్తపోటు బీపీ పెరగటం. పోగతాగడం. మధ్యపానంతో రక్తనాళాలు దెబ్బతిని చిట్లిపోయి పక్షవాతం వస్తుంది.అధిక రక్తపోటు మధుమేహాం మెదడులో కణతులు రక్తంలో కొవ్యు పదార్థాలు వల్ల మెదడువాపు వచ్చే వ్యాధుల వల్ల గుండెజబ్బుల వల్ల స్థూలకాయుల్లోనూ 70ఏళ్ల దాడిన వారిలో వ్యాధి వస్తుంది.


వ్యాధి లక్షణాలు….!!


పక్షవాతం వచ్చినవారిలో ఒకే వస్తువు రెండుగా కనపడటం మాట తడబడి,అయోమయంగా మాట్లాడటం,మింగుడు పడకపోవడం.నీరు సరిగా తాగలేకపోవడం.కళ్లు తల తిరగటం. ఆకస్మాత్తుగా తీవ్రమైన తలనోప్పి వాంతులు, నడకలో తూలుతు మూతి ఒకవైపు వంకర పోవడం. దృష్టి మందగించడం. కాళ్లు చేతులు ఉన్నట్టుండి బలహీన పడటం. వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రోగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది.

డాక్టర్‌..శ్రీధరాల శ్రీనివాస్‌ న్యూరో సర్జన్‌ ఉస్మానియ ఆసుపత్రి హెచ్‌వోడి.


బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన వారిలో నూటిక 80శాతం మందికి మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా పక్షవాతం తగ్గుతుంది. బ్రెయిన్‌లో రక్తపుగడ్డ పెద్దసైజులో ఉన్నప్పుడు 20శాతం పక్షవాతం కేసులకు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేస్తేనే రోగి బతికే అవకాశాలు ఉన్నాయి.బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితుడికి గోల్డ్‌న్‌ అవర్‌లో న్యూరో సర్జన్‌ వైద్యుడి తీసుకెళ్తే సకాలంలో ఆపరేషన్‌ చేసి ప్రాణాలు కాపాడతారు. ఆధునికవైద్య సేవలు నేడు అందుబాటులో ఉన్నాయి…


డాక్టర్‌ కే.సాయి సతీష్‌,న్యూరోలాజీస్ట్‌…యాశోదఆసుపత్రి.


స్ట్రాక్‌ రెండు రకాలు ఉంటుంది.రక్తగడ్డ కట్టడం, బ్లిడిరగ్‌, బీ.ఈ.ఎఫ్‌. ఏ.టీ,వీటిలో ఎదైన లక్షాణాలు కనిపించిన వేంటనే వచ్చిన రోగికి సాధ్యమైనంత మేరకు గంట నుండి 3గంటల్లోపు స్ట్రోక్‌ యూనిట్‌కు తీసుకు రావడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు.కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయో ప్రమాదం ఉంది.చిన్నా పెద్ద వయస్సుతో నిమిత్తం లేకుండా పుట్టిన బేబి నుంచి వృద్ధులకు ఎవరికైన స్ట్రోక్‌రావచ్చు.మన శరీరంలో ఎదైనా భాగానికి రావచ్చు.మెదడులో రక్తప్రసరణ సరిగా జరగనికారణంగా,దేబ్బతగిలి బ్లిడిరగ్‌ వచ్చిన కూడ పక్షవాతం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News