Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయంPM Modi | ఇబ్సా కూటమి ప్రతిపాదన

PM Modi | ఇబ్సా కూటమి ప్రతిపాదన

ప్రధాని మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా(South Africa)లోని జొహన్నెస్‌బర్గ్‌(Johannesburg)లో జరుగుతున్న జీ20 సదస్సు(G20 summit)లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ బ్రెజిల్(Brazil), సౌతాఫ్రికా అధినేతలతో సమావేశమయ్యారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూల డిసిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో భేటీ అయ్యారు. ఇండియా(I), బ్రెజిల్(B), సౌతాఫ్రికా(SA)లతో ఇబ్సా (IBSA) అనే డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్‌(Digital Innovation Alliance)ను ఏర్పాటుచేద్దామని ప్రతిపాదించారు.

ఈ కూటమి యూపీఐ(Upi), కొవిన్(Cowin), సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పరస్పరం పంచుకుంటుంది. ఈ విషయాన్ని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇబ్సా నిధులతో ఇప్పటికే 40 దేశాల్లో ఎడ్యుకేషన్, హెల్త్, మహిళల అభివృద్ధి, సోలార్ పవర్ వంటి అంశాలపై పనిచేస్తోందని మోదీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News