Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణమెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

  • సమయాన్ని పొడిగించిన యాజమాన్యం

హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రో సేవలు ఎంతో కీలకంగా మారాయి. ఎందుకంటే నగరంలో ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ట్రాఫిక్‌ సమస్య వల్ల చాలా సమయం పడుతుంది. అదే మెట్రోలో వెళితే.. నిమిుుషాల్లో వెళ్లవచ్చు. అందుకే చాలామంది మెట్రోలోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగించాలని ఎప్పటి నుంచే డిమాండ్‌ చేస్తున్నారు. మన భాగ్యనగరంలో తక్కువ కాలంలోనే పాపులర్‌గా మారిన మెట్రో రైలు సర్వీసులు విషయంలోనూ అనేక మంది ప్రయాణికులు రాత్రి 12 గంటల వరకు సేవలు సేవలు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ఎట్టకేలకు అది నెరవేరింది. ప్యాసింజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది హైదరాబాద్‌ మెట్రో. మెట్రో రైల్‌ సమయం పొడిగించారు. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మెట్రో రైల్‌ సమయాన్ని పొడిగించారు హైదరాబాద్‌ మెట్రో అధికారులు. మారిన టైమింగ్స్‌ ప్రకారం.. ఇక మీదట సోమవారం నుంచి శుక్రవారం వరకు.. ఆయా టెర్మినల్‌ స్టేషన్స్‌ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో రైలు ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి రాత్రి 11 గంటల 45 నిమిషాల దాకా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. శనివారం నాడు ఆయా టెర్మినల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటలకు తొలి మెట్రో స్టార్ట్‌ అవుతుంది. రాత్రి 11 గంటల వరకు రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక నుంచి ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు ఆయా టెర్మినల్‌ స్టేషన్‌ నుంచి ఫస్ట్‌ మెట్రో రైలు మొదలవుతుంది. సండే కూడా రాత్రి 11 గంటల వరకే రైళ్ల రాకపోకలు ఉంటాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News