Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Accident | హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం

Accident | హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం

  • లాలాగూడ పీఎస్‌ పరిధిలో అత్యంత వేగంతో డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన కారు
  • ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి..పలువురికి గాయాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాయి. కొంతమంది వాహనదారులు అత్యంత వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయా ఘటనల్లో వాహనదారులు మృతి చెందుతుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు వెల్లడిరచారు.లాలాగూడ పీఎస్‌ పరిధి లాలాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కారు అత్యంత వేగంతో వచ్చి బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు యువకులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఈ ఘటనలో మృతిచెందిన వారు మల్కాజ్‌గిరికి చెందిన హర్షిత్‌ రెడ్డి(22), చెంగిచర్లకు చెందిన శివమణి (23)గా గుర్తించారు.

- Advertisement -

నలుగురు స్నేహితులు కీసర నుంచి తార్నాకాకు టిఫిన్‌ చేసేందుకు వెళ్తుండగా ఈఘటన జరిగింది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరగడంతో లాలాపేటలో ట్రాఫిక్‌ స్థంభించింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పోలీసులు పక్కకు పెట్టి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News