Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణఅద్దె కొంపలో ఇంకెన్నాళ్లు..?

అద్దె కొంపలో ఇంకెన్నాళ్లు..?

  • ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న వికారాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌
  • ఖాళీగా పడి ఉన్న పలు ప్రభుత్వ భవన సముదాయాలు

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏండ్ల తరబడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని నిర్మించి అన్ని శాఖలను ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా డీపీఓ, ఆడిట్‌, డిఎం అండ్‌ హెచ్‌ ఓ వంటి పలు ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ ఏర్పడ్డాయి. ఇలా జరిగి కూడా మూడేండ్లు గడిచింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వంటి కార్యాలయాలను ఖాళీగా ఉన్న భవనాల్లో కి మారిస్తే అద్దే చెల్లించాల్సిన అవసరం ఉండదు కదా అని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. ఇరుకిరుకు గదుల తో ఉన్న ప్రైవేట్‌ భవనానికి నెలకు 25 వేల పైనే అద్దె చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News