- ప్రేమించుకుంటేనే
- సంతోషం సిద్ధిస్తుంది
మనిషి కోరికల పుట్ట
కోరికల సాధన కొరకు
నిరంతరం పోరాడుతాడు
ఇతరులతో పోటీపడతాడు
ఆస్తుల సంపాదనకు
అధికార చెలాయింపుకు
ప్రయత్నిస్తుంటాడు
ఇతరులతో సమానంగా
ఆర్థికంగా ఎదగడానికి
అడ్డదారులు తొక్కుతాడు
అనుకున్న పనులు కాకపోతే
ఆందోళనతో కుంగిపోతాడు
లక్ష్యసాధనలో సవాళ్లు
ప్రతి సవాళ్లను ప్రణాళిక
బద్ధంగా సమయాను
కూలంగా ఎదుర్కోవడంలో
విఫలమై ఆందోళన
ఊబిలో చిక్కుకుపోతాడు
ఎలాంటి పరిస్థితులు నైనా
చలించకుండ ఉండేవారే
తమ జీవితంలో ఎవరు ఉన్నా
లేకున్నా చింతించని నిచ్చలస్థితి
కలిగిన వారే ఆనందంగా ఉంటారు
మనలోని లోపాలను
అంగీకరించడం
మనల్ని మనం సంపూర్ణంగా
ప్రేమించుకున్నప్పుడే ఆనందం
మొదలవుతుంది అప్పుడే
సంతోషం సొంతం అవుతుంది
నీ నీడను చూసి
నీవు మురిసిపోతే
లోకం నిన్ను చూసి
అబ్బురపడుతుంది
నీ మనసు గాయానికి
నీవే మంధైతె ఏ బాధ
నిన్ను కుంగతీయదు
నిన్ను నీవు గౌరవించుకో
ఇతరులు నిన్ను
గుర్తించాలని కోరుకునే
ముందు నిన్ను నువ్వు
అక్కున చేర్చుకో
నీ లోపాలను ప్రేమతో
స్వీకరించు నీ సంతోషం
నీచేతుల్లోనే ఉంటుంది
సంతోషంగా ఉండడానికి
వేరే ఎవరో రావాల్సిన పనిలేదు
మన ఆలోచనలే మన
ప్రపంచాన్ని సృష్టిస్తాయి
బయట ప్రపంచం
ఆందోళనలో ఉన్న
నీపైనీకు నమ్మకం ప్రేమ
అంతరాత్మను ఎప్పుడు
ప్రశాంతంగా ఉంఛుకో
లోకమంతా నిన్ను వేలెత్తి చూపిన
నీపై నీకు నమ్మకం ఉంటే చాలు
గమ్యం వైపు సాగాలంటే
నీ మనసే నీకు దిక్సూచి కావాలి
ఎక్కడో సంతోషం కోసం వెతుకకు
అది నీ ఆత్మలోనే దాగి ఉంది
నీలోని వెలుగును నీవు గుర్తిస్తే
ప్రతిరోజు ఒక వసంతం అవుతుంది
నిన్ను నీవే ప్రేమించుకో
వెతుకకు ఎక్కడో
సుఖశాంతులకొరకు
నీలోనే ఉన్నాయి
సంతోషానికి మూలాలు
నీవు నీలా ఉండడమే
గొప్ప విషయం
ఒకరి మెప్పుకోసం
ప్రాకులాడకు
నీవ్యక్తిత్వాన్ని
ఎప్పుడు వీడకు
నీలోని లోపాలను
చిరునవ్వుతో స్వీకరించు
నీ ప్రతి గెలుపును నీవే
పండుగల మార్చు
ఓటమి ఎదురైతే కుంగిపోకు
నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు
నిన్ను నువ్వు ప్రేమించుకున్న
ప్పుడే నీచుట్టూ ఉండే ప్రపంచం
కూడా అందంగా కనిపిస్తుంది
ఆనంద నీ సొంతమై సంతోషం
రెట్టింపౌతుంది
మనల్ని మనం ప్రేమించుకుందాం
మమత ప్రేమను పంచుదాం
ఆనందాన్ని అందరికి అందిద్దాం
ఆర్ధత ఆప్యాయత
పునాదుల మీద కుటుంబ
వ్యవస్థ పునర్వికాసంతో
సామాజిక విలువల
వృక్షాన్ని పెంచుదాం
మానవతా ఫలాలు
అందరికీ పంచుదాం
మానవ మనుగడకు
పాటుపడుదాం
- నేదునూరి కనకయ్య
