రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో విషాదం
ఉప్పల్, నవంబర్ 20 (ఆదాబ్ హైదరాబాద్): ఉప్పల్ (Uppal) పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ (Ramanthapur) కేసీఆర్ నగర్(Kcr Nagar)లో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపు(Water Sump)లో పడి గృహిణి (House Wife) మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీరాములు, భారతి దంపతులు 20 ఏళ్ల కిందటి నుంచి రామంతాపూర్ కేసీఆర్ నగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇవాళ ఉదయం భారతి నల్లా నీళ్లు (Tap Water) పట్టుకునేందుకు సంపు తెరిచి నల్లా వాల్ బందు చేస్తుండగా ప్రమాదవశాత్తు సంపులో పడిపోయింది. దీంతో తలకు తీవ్రగాయమైంది. పక్కింటివాళ్లు గమనించి భర్తకు చెప్పగా సంపులో నుంచి భారతిని బయటకు తీసి స్థానిక హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
