Wednesday, March 4, 2026
Homeఆజ్ కీ బాత్Exploitation | పేదోడి ఆర్తనాదం మీ చెవికి చేరదా

Exploitation | పేదోడి ఆర్తనాదం మీ చెవికి చేరదా

నెలవంక నవ్వాల్సిన నిండు వైద్యశాల, నేడు కాసుల కక్కుర్తితో కరిగే కఠోర శిల. పేరు మారుస్తారు. సర్టిఫికెట్ మార్చేస్తారు. అక్రమాలకు ఆశ్రయమై అడ్డంగా దోచేస్తారు. ?నమ్మకంతో వచ్చిన నిరుపేద రోగి. మీ కపట వలకు చిక్కిన బలి పశువు! బతుకు భయానికి ఎంత బిల్లు వేసినా, ప్రాణం కంటే ఎక్కువ పట్టింపు లేదుగా! గుండె నిబ్బరం కూలి, ఒంట్లో శక్తి ఆరిపోగా, దైవంలా మిమ్మే నమ్మితే, దారుణంగా మోసం! పేదోడి ఆర్తనాదం మీ చెవికి చేరదా? మానవత్వం మంటగలిపి, మాఫియాగా మారేరా? వైద్యం అంటే సేవ, ప్రాణదానం -ధర్మం, నేడు అదే దోపిడీ, రక్తపు ముద్దల కంపు. దోపిడీ దొంగల హాస్పిటల్స్ను రద్దు చేయాలి. ?పేదోడి కన్నీరు కాలుష్యమై పోకముందే, న్యాయం జరగాలి, నిజమైన సేవ బతకాలి!

  • సౌరం జితేందర్
- Advertisement -
RELATED ARTICLES

Latest News