Saturday, October 4, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుహైదరాబాద్‌లో హైకోర్ట్ లాయర్ కిడ్నాప్

హైదరాబాద్‌లో హైకోర్ట్ లాయర్ కిడ్నాప్

హైదరాబాద్‌‌లోని వనస్థలిపురంలో హైకోర్ట్ లాయర్ కిడ్నాప్‌కు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు పాలడుగు నారాయణ అనే సీనియర్ న్యాయవాదిని తీసుకెళ్లి డబ్బు డిమాండ్ చేశారు. సరస్వతినగర్‌లోని ఎస్ఎన్ఆర్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇస్తేనే నీ భర్తను సురక్షితంగా వదిలేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.

దీంతో.. ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించగా వాళ్లు రంగంలోకి దిగి నారాయణ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో భూవివాదం నేపథ్యంలో దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు. నగరమంతా ఒడపోస్తున్నారు. మొత్తానికి గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ నంబర్లు, వాటి లొకేషన్ల ఆధారంగా అడ్వొకేట్‌ను సేఫ్‌గా ఇంటికి చేర్చారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు పంపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News