- తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్య నిపుణులు..
- బీపీ బారిన పడినవారు చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అవుతారు..
- హార్ట్, బ్రెయిన్, కిడ్నీలు, కళ్ళు ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి..
బ్లడ్ ప్రెజర్ దీనినే రక్తపోటు అని కూడా అంటారు. చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. ఊరికే కోపం రావడం, అరవడం చేస్తుంటారు ఇలాంటివారు. చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవ్వడాన్ని చూసి చాలా మంది బీపి పెరిగిందా ఏంటి అని కామెంట్ కూడా చేస్తుంటారు. నిజమే మరి బీపి పెరిగినవారు ఇలానే బిహేవ్ చేస్తారు. ఇది బాహ్యంగా కనిపించే లక్షణం. కానీ, లోలోపల చాలా డ్యామేజ్ జరుగుతుంది. బీపి పెరగడాన్ని గమనించకపోతే చాలా సమస్యలొస్తాయి. ఇంటర్నల్‌గా అవయవాలన్నీ దెబ్బతింటాయి.
ఇది శరీరంలోని వివిధ అవయవాలపై ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. హార్ట్, బ్రెయిన్, కిడ్నీలు, కళ్ళు ఇవన్నీ కూడా లోలోపలే డ్యామేజ్ అవుతాయి. అందుకే, దీనిని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమాత్రం చేసిన ప్రమాదకరమైన గుండె సమస్యలు వచ్చి స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వరకూ సమస్యల్ని తీసుకొస్తాయి. దీని గురించి ముందుగానే అలర్ట్ అవ్వడం మంచిదని డాక్టర్లు అంటున్నారు..
