ఈ నెల 26న హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్ జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్, మరియు కారుణ్య లు కలసి ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో జరగనున్న లైవ్ కాన్సర్ట్ లో పాల్గొననున్నారను తెలిపారు. ‘ఆరెంజ్’ సినిమా రీ-రిలీజ్ సమయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ షో చేయాలనిపించిందని తెలిపారు.
అలాగే ఈ కాన్సర్ట్ తెలుగు అభిమానులకు ప్రత్యేకమైన ట్రీట్ అవుతుందని, ముఖ్యంగా ఆరంజ్ మూవీ, వాసు మరియు ఘర్షణ సినిమాల పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. ఈ కాన్సర్ట్ ప్రత్యేకత గురించి మాట్లాడుతూ, 13 సింగర్స్ తో పాటలు పాడబోయే గాయకులందరూ ఆ పాటల అసలు గాయకులే కావడం ఈ షోకు ప్రత్యేకమైన ఆకర్షణ అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కోరా క్లబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు, ఇది అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించే కార్యక్రమంగా, హైదరాబాద్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సంగీత వేడుకగా నిలుస్తుందని తెలిపారు. టికెట్లు ప్రస్తుతం డిస్ట్రిక్ట్ బై జోమాటో అందుబాటులో ఉన్నాయన్నారు.
