Wednesday, February 11, 2026
HomeసినిమాAnnagaru Vostaru | "అన్నగారు వస్తారు" మూవీ ట్రైలర్ రిలీజ్

Annagaru Vostaru | “అన్నగారు వస్తారు” మూవీ ట్రైలర్ రిలీజ్

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “అన్నగారు వస్తారు” ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ రోజు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా “అన్నగారు వస్తారు” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కంప్లీట్ ఎంగేజింగ్ గా ఉందని, థియేటర్స్ లో సినిమా చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని హరీశ్ శంకర్ అప్రిషియేట్ చేస్తూ..”అన్నగారు వస్తారు” సినిమా టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.

- Advertisement -

“అన్నగారు వస్తారు” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ‘ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న సరదా అయిన పోలీస్ ఆఫీసర్ కార్తి. ఆయనకు బాల్యం నుంచే సినిమాతో అనుబంధం ఏర్పడుతుంది. పోలీస్ డిపార్ట్ మెంట్ పట్ల ప్రజల్లో మర్యాద పెరగాలని సఫారీతో యూనిఫామ్ కుట్టించుకుంటాడు. హీరోయిన్ ను కలిసినప్పుడు జాలీ టు మీట్ యూ అని రొమాంటిక్ గా పలకరిస్తాడు. మరోవైపు చేతివాటం చూపిస్తుంటాడు.

అయితే సమాజానికి ఒక రియల్ హీరో అవసరమైనప్పుడు అన్నగారిలా అరంగేట్రం చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ కార్తి, అన్నగారులా ఎలా వచ్చారు. సొసైటీ కోసం ఏం చేశారు అనేది ట్రైలర్ లో ఆసక్తి కలిగించింది. కార్తి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంది. ఈ కమర్షియల్ హంగులకు తోడు అన్నగారి గెటప్ అదనపు ఆకర్షణగా నిలిచింది. థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిన కంప్లీట్ ఎంటర్ టైనర్ గా “అన్నగారు వస్తారు” మూవీ ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.

నటీనటులు – కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్
మ్యూజిక్ – సంతోష్ నారాయణన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి

- Advertisement -
RELATED ARTICLES

Latest News