శాసన సభ సమావేశాల(Assembly Meetings) నిర్వహణ విషయమై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత(Brs Party Senior Leader), సిద్దిపేట ఎమ్మెల్యే(Siddipet Mla) హరీష్‌రావు(Harish Rao) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar)కి పలు ప్రశ్నలు సంధించారు. ‘అధ్యక్షా.. మీరు ఈ సభకు కస్టోడియన్. ఈ సభలో అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఎమ్మెల్యేలందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. మా గొంతు నొక్కుతున్నప్పుడు, మా హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు మీరు మా రెస్క్యూకి రావాలి. మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి.
బీఏసీ సమావేశంలో మనం ఏం మాట్లాడుకున్నాం? అసెంబ్లీ సమావేశాలను కనీసం 7 రోజుల పాటు నడుపుతామని అందరి సమక్షంలో నిర్ణయించాం. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ బీఏసీ మీటింగ్ పెట్టి పొడిగింపుపై నిర్ణయిద్దామని అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా బీఏసీ మినిట్స్‌లో ఆ ఏడు రోజుల ప్రస్తావన ఎందుకు పొందుపరచలేదు. సభలో తీసుకున్న నిర్ణయానికి మినిట్స్‌లో పొంతన లేకపోతే ఎలా? సభలో జరగబోయే బిజినెస్ గురించి, అజెండా కాపీలను తెల్లవారుజామున 2, 3 గంటలకు పంపిస్తున్నారు. సభ్యులు ఎప్పుడు నిద్రలేవాలి? ఎప్పుడు చదువుకోవాలి?’ అని అడిగారు.
సబ్జెక్ట్ మీద ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి?
‘సభ ప్రారంభానికి కనీసం 24 గంటల ముందు ఎజెండాను సభ్యులకు పంపాలనేది ఈ సభ ఆనవాయితీ. ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పాటించడం లేదు. దీనివల్ల అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోతోంది. మేం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే మాకు సమాధానం చెప్పాల్సింది పోయి సభా నాయకుడిగా ఉన్న సీఎం.. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. మేము అడిగిన ఏ ఒక్క పాయింట్‌కు సీఎం దగ్గర క్లారిఫికేషన్ లేదు.
పైగా మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేయడం సభ్యుడి హక్కు. మాకు మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ సరికాదు. మూసీ నది కంపు కన్నా సీఎం మాటల కంపు ఎక్కువగా ఉంది. సభా నాయకుడి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉంది’ అని హరీష్ రావు దుయ్యబట్టారు.
