Tuesday, February 10, 2026
Homeమెదక్‌Harish Rao | విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణీ

Harish Rao | విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణీ

మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట ఎమ్మెల్యే(Siddipet Mla) హరీష్‌రావు సోమవారం సిద్దిపేట రూరల్ మండలం, చింతమడక బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో(Chintamadaka BC Residential School) విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణీ(Blankets Distribution) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్(BC Residential Schools) 16 మాత్రమే ఉండగా ఆయన సీఎం అయ్యాక వాటిని 350కి పెంచారని చెప్పారు. బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT)లో సీటు పొందినవారికి సొంతంగా ఐ ప్యాడ్(I Pad) కొనిస్తానని హామీ ఇచ్చారు. జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన 11 మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధించారని తెలిపారు. బైపీసీ విద్యార్థులు బాగా చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు పొందితే వాళ్లకు ఫీజులు చెల్లిస్తానని చెప్పారు. సీటు మీది… ఫీజు నాది.. అని భరోసా కల్పించారు. వచ్చే ఏడాది సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్యను 280కి పెంచుతామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News