Monday, October 27, 2025
ePaper
Homeమేడ్చెల్‌Harassment | విద్యార్థినికి వేధింపులు.. ప్రిన్సిపల్‌పై కేసు..

Harassment | విద్యార్థినికి వేధింపులు.. ప్రిన్సిపల్‌పై కేసు..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర(Keesara)లో విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఆంజనేయులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగారం (Nagaram) ఈస్ట్ గాంధీనగర్‌లో ఉన్న శాంతినికేతన్ (Shantiniketan) స్కూల్లో ఓ బాలిక (13) 8వ తరగతి చదువుతోంది. కొన్నిరోజులుగా పాఠశాల ప్రిన్సిపల్(Principal) సాయిబాబా(65).. ఆమె చదువులో వెనకబడి ఉందని చెప్పి ప్రత్యేక తరగతుల పేరిట పిలిపించి అసభ్యకరంగా (Obscenely) ప్రవర్తించాడు. అతని వేధింపులు భరించలేక విద్యార్థిని ఆ విషయాన్ని తల్లిదండ్రుల(Parents)కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News