HomeఫోటోలుHaiku | ‘హైకూ’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్...

Haiku | ‘హైకూ’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్…

విజన్ సినిమా హౌస్ బ్యానర్ మీద డాక్టర్ డి. అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్న చిత్రం ‘హైకూ’. ఈ సినిమాలో ఏగన్, శ్రీదేవి, అడ్రిచి అరుణ్, కలైవాణి బాస్కర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మూవీకి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. జో ఫేమ్ హరిహరణ్ రామ్ అడిషనల్ స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది. ఈ మేరకు చిత్రయూనిట్ ఆనందంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Haiku First Shooting Schedule Completed

ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో ఏగన్, శ్రీదేవి, అడ్రిచి అరుణ్, కలైవాణి బాస్కర్ మీద కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ సజావుగా, సమయానికి ముగిసిందని టీం చెబుతోంది. ఈ కమిట్మెంట్‌ను చూస్తుంటే.. ఈ మూవీ జర్నీపై మరింత నమ్మకం ఏర్పడిందని, ఎంతో ఆశాజనంగా అనిపిస్తోందని మేకర్స్ తెలిపారు.

- Advertisement -
Haiku First Shooting Schedule Completed1

మొదటి షెడ్యూల్‌లోని ఫుటేజ్‌తో సంతృప్తికరంగా ఉన్నామని టీం చెబుతోంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ ప్రియేష్ గురుస్వామి అందించిన మ్యాజికల్ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయట. క్వాలిటీ మేకింగ్, టీం ఎఫెర్ట్స్ పట్ల నిర్మాతలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక రెండో షెడ్యూల్‌ను త్వరలో చెన్నైలో ప్రారంభించనున్నారు. చెన్నైలోని పరిసర ప్రాంతాల్లో కథలోని కీలకమైన భాగాలను చిత్రీకరిస్తామని తెలిపారు.

Haiku First Shooting Schedule Completed2

‘హైకూ’ సెప్టెంబర్ 2026లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు టీం ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ఇక త్వరలోనే మరిన్ని అప్డేట్‌లను అందిస్తామని టీం చెబుతోంది.

Haiku First Shooting Schedule Completed0
- Advertisement -
RELATED ARTICLES

Latest News