Sunday, February 22, 2026
Homeఅంతర్జాతీయంH-1B | మరింత జాప్యం

H-1B | మరింత జాప్యం

  • హెచ్ 1బీ వీసాల అపాయిట్మెంట్ల ఇంటర్వ్యూలు ఆలస్యం..
  • ఈ ఏడాది పోస్ట్ పోన్ అయిన స్టంపింగులు వచ్చే ఏడాదికి వాయిదా
  • కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటమే కారణం..

హెచ్ 1బీ వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అప్పాయింట్‌మెంట్లు మరింత జాప్యం అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చికి వాయిదా పడిన స్టాంపింగ్‌లు తాజాగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఫలితంగా భారతీయ వత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం ఏర్పడింది. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వేలాది మంది నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది.గత ఏడాది చివర్లో మొదలైన ఈ సమస్య ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది.వాస్తవానికి డిసెంబర్ 2025లో తొలిసారి వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలలో జాప్యం కనిపించింది.

అప్పట్లో ఉన్న అపాయింట్‌మెంట్లను మార్చి 2026కు మార్చారు. ఆ తర్వాత అవే తేదీలు అక్టోబర్ 2026కు వెళ్లాయి. ఇప్పుడు తాజా పరిస్థితిలో, చాలా అపాయింట్‌మెంట్లు నేరుగా 2027 మధ్య నాటికి వాయిదా పడినట్లు విÖడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతం కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు దాదాపుగా లేవని అధికారులు చెబుతున్నారు. ఉన్న అపాయింట్‌మెంట్లను కూడా సగటున 18 నెలల తర్వాతకు మార్చాల్సి వస్తోంది.ఫలితంగా, ఇప్పటికే అపాయింట్‌మెంట్ తీసుకున్న వారికి ఈమెయిల్స్ ద్వారా తేదీల మార్పు సమాచారం అందుతోంది.

- Advertisement -

ఈ పరిణామాలతో ఇమిగ్రేషన్ నిపుణులు అమెరికాలో ప్రస్తుతం పని చేస్తున్న భారతీయ వత్తి నిపుణులకు కీలక సూచనలు చేస్తున్నారు. ‘వీసా స్టాంపింగ్ కోసం ఇప్పుడే భారత్‌కు రావద్దు’ అని వారు హెచ్చరిస్తున్నారు. కాగా అమెరికన్ బజార్ వెబ్‌సైట్ కథనం ప్రకారం, 2027 వరకు సాధారణ వీసా స్టాంపింగ్ అపాయింట్‌మెంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని పేర్కొంది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన కొందరికి కూడా ఇంటర్వ్యూలు రద్దైనట్లు సమాచారం. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్‌మెంట్లు ఉన్న వారికి సైతం, తేదీలు మార్చి ఏడాది తర్వాతకు కేటాయించినట్లు ఈమెయిల్స్ వచ్చాయి.

ఈ జాప్యాల ప్రభావం వేలాది కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన అనేక మంది తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపో యారు.కొందరి భార్యాభర్తలు, పిల్లలు అమెరికాలో ఉండగా, తల్లిదండ్రులు భారత్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు, ఉద్యోగ ఒప్పందాలు, హౌసింగ్ అగ్రిమెంట్లు వంటి విషయాల్లో కూడా సమస్యలు మొదలయ్యాయి. వీసా గడువు ముగిసిన చాలా మందికి వారి కంపెనీలు పొడిగింపులు ఇవ్వడం లేదు.

కొందరికి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఎదురవుతోంది.ఇదే సమయంలో కొత్త హెచ్`1బీ వీసాల విషయంలోనూ పరిస్థితి అంత అనుకూలంగా లేదు. లక్ష డాలర్ల వరకు ఫీజు ఉండటంతో, చాలా కంపెనీలు కొత్త వీసాల కోసం దరఖాస్తులు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో కొత్తగా అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణుల ఆశలకూ గండిపడుతోంది. ఈ సమస్య మరింత తీవ్రమయ్యేలా అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల తీసుకున్న మరో నిర్ణయం కారణమైంది.

భారతీయులు ఇతర దేశాల్లోని అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చేయించుకునే అవకాశాన్ని నిలిపివేయడం వల్ల, మొత్తం భారం భారత్‌లోని కాన్సులేట్లపైనే పడింది. దీంతో అపాయింట్ మెంట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.మొత్తానికి, వీసా స్టాంపింగ్ జాప్యాలు భారతీయ వత్తి నిపుణుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News