Tuesday, October 28, 2025
ePaper
Homeహైదరాబాద్‌Ramchander Rao | రాష్ట్రంలో గన్ కల్చర్

Ramchander Rao | రాష్ట్రంలో గన్ కల్చర్

  • జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే.. రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేస్తారు
  • తెలంగాణలో పోలీసులకు కూడా రక్షణ లేదు
  • రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది
  • కనీస మద్దతు ధరకు పంటను కొనాలె
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తెలంగాణ భవిష్యత్
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్ తో ముడిపడి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా మజ్లిస్ ను పెంచి పోషించడమేనని అన్నారు. డబ్బు కుమ్మరించడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ ను గెలిపించే ప్రయత్నం జరుగుతుంది. చొరబాటు దారులు, రోహింగ్యలు పెత్తనం చలాయిస్తున్నారు.

ఈ ఎన్నికను బీజేపీ కార్యకర్తలు సవాల్గా తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలో 5 వందల హత్యలు జరిగాయి. పోలీసులకే రక్షణ లేదు. గన్ కల్చర్ పెరిగిపోయింది. శాంతి భద్రతలు క్షీణించిపోయాయి. ఇక బీఆర్ఎస్ గత చరిత్రనే.. మళ్లీ గెలిచేది లేదు. కాంగ్రెస్ మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద పట్టు కోల్పోయారు. ఐఏఎస్ లు బలవంతంగా పదవి విరమణ చేసే పరిస్థితి వచ్చింది. బీసీ నినాదం ఎత్తుకుని రాహుల్ గాంధీ అభాసు పాలయ్యారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు.

మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది. రాహుల్ కుటుంబం. మోడీ ఓటు బ్యాంక్ను చీల్చే కుట్ర. బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే అది మోడీ ప్రభుత్వంతోనేనని లక్ష్మణ్ అన్నారు. బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలువబోతుంది. జంగల్ రాజ్ ఉన్నా బీహార్ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంది. రాహుల్ గాంధీ విదేశీ కుట్ర దారులతో చేతులు కలిపారు. దేశాన్ని మతాల పేరుతో విడగొట్టి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడుతున్నారు. ఓటు చోరీ నినాదం కాంగ్రెస్కి బూమరంగ్ అయింది. దొంగ ఓట్లను చేర్పించి దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్ అరుస్తుంది.

తెలంగాణలో ప్రజలు కాచుకుని. చూస్తున్నారు. బీజేపీ పాలిత రాష్టాల్లో పారదర్శకత, జవాబు దారి పాలన తెలంగాణలో కూడా రావాలని చూస్తున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో భాజపా విజయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచందర్రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్లో మజ్లిస్-భాజపా మధ్యే పోటీ ఉంటుంది.

ప్రజలు భాజపాకు ఓటేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయి. ఆ పార్టీని ఆపాలంటే భాజపాను గెలిపించాలి. జూబ్లీహిల్సు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి చేసిందేమీ లేదు. భాజపాను గెలిపించాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని రామచందర్రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం చెందారు. దీంతో జూబ్లీహిల్స్కు బైపోల్ అనివార్యమైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఫలితం మాత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ పోటీ పడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News