అధికారం అడ్డు పెట్టుకొని తమ్ముడు మధు సుధన్ రెడ్డితో భారీ భూ స్కాం..
- ప్రభుత్వ భూములు, పేదల భూములను దర్జాగా కబ్జాలు చేసిన దుర్మార్గం..
- మైనింగ్ పేరుతో ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిన ముష్కరులు..
- వేల కోట్ల విలువైన సొమ్ము బినామీల పేరుతో దోచుకుంటున్న వైనం..
- వీరి అక్రమాలకు పచ్చజెండా ఊపిన గత బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం..
- ధరణిని అడ్డుపెట్టుకుని దందాలు చేస్తూ దొడ్డి దారిన పట్టాలు..
- అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసుకొని భూ కబ్జాలు..
- పేదల భూములు కొట్టేసిన ఘనాపాటీలు..
- ఇంత చేస్తున్నా వీరిపై నేటికీ నమోదుకాని ఫోర్జరీ, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు..
- ఉన్నతాధికారులు విచారణ చర్యలు చేపట్టాలని వెల్లువెత్తున్న డిమాండ్స్..
సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు నియోజక వర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని అడ్డుపెట్టుకొని చేసిన కబ్జాలు, స్కాములు గత బీ.ఆర్.ఎస్. ప్రభుత్వంలో అడ్డు అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. ప్రభుత్వ సంపదను కాజేయుటకు సంతోష్ సాండ్ గ్రానైట్ కంపెనీ పేరుతో అక్రమంగా మైనింగ్ తవ్వి వందల కోట్లు కొల్లగొట్టిన విషయం విదితమే.. అధికారులు విచారణ జరిపి కేసు నమోదు చేసి జైలుకు పోయిన వీరి అక్రమాలు, కబ్జాలు ఆగలేదు అంటూ బోరున విలపిస్తున్నారు పేద ప్రజలు..

సామాన్యుల భూములకు నకిలీ లే అవుట్ సృష్టించి, ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దర్జాగా కబ్జాలు చేస్తున్న వీరి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత ప్రజలు..పేద ప్రజల భూములతో పాటు ప్రభుత్వ భూములను సైతం వదలకుండా కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేసి కోట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. బినామీలను పెట్టుకొని గత ప్రభుత్వంలో సబ్ రిజిస్ట్రార్ లను వీరి అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ లు చేసుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

స్థానిక ప్రజలు చేస్తున్న ఆరోపణలకు ఈడి అటాచ్ చేసిన ఆస్తులను పరిశీలిస్తే వారి ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుంది.. మునూత్ ట్రస్ట్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అమీన్ పూర్ లో కబ్జాలు చేసి అడ్డదారిలో రెవెన్యూ రికార్డుల్లో బినామీల పేరున వందల కోట్ల విలువైన భూములను నమోదు చేసుకున్నా నేటికి వీరిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు కాకపోవడం ఏంటని మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు.. గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు పేరుతో వందల కోట్లు కొల్లగొట్టిన నాటి మైనింగ్ శాఖ మంత్రి మౌనం ఎందుకు వహించారన్నది ప్రశ్నార్ధకంగా మారింది..
గత ప్రభుత్వంలో వీరు సృష్టించిన సమస్యలతో నేటికి ఆఫీసుల చుట్టూ,కోర్టులు చుట్టూ కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత ప్రజలు.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, వీరి కబ్జాలను కట్టడి చేసి వీరి బారిన పడి ఇబ్బందులకు గురి అవుతున్న పేద ప్రజలకు న్యాయం జరిగేలా చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలనీ డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు.. సిట్ ఏర్పాటు చేసి వీరి కబ్జాల వ్యవహారం పై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే డిమాండ్స్ సైతం బలంగా వినిపిస్తున్నాయి..

గూడెం మహిపాల్ రెడ్డి తన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని అడ్డుపెట్టుకొని చేసిన కబ్జాలకు సంబంధించి నకిలీ లే అవుట్ ఎలా సృష్టించారు..? అక్రమంగా ఎన్ని విల్లాలు నిర్మిస్తున్నారు..? ప్రభుత్వ భూములను ఎలా కబ్జాలు చేశారు..? గత ధరణిలో రికార్డులో అక్రమంగా ఎలా నమోదు చేసుకున్నారన్న ఆధారాలకు సంబంధించి మరో కథనం ద్వారా వాస్తవాలు ఆధారాలతో వెలుగులోకి తేనుంది
“ఆదాబ్ హైదరాబాద్” “మా అక్షరం అవినీతిపై అస్త్రం”..
