- భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వేముల
- 10 లక్షల విరాళంను ప్రకటించిన ఎమ్మెల్యే
చిట్యాల శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులలో భాగంగా ప్రభుత్వ భూమిలో కళ్యాణ మండపం నిర్మాణానికి సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ వేముల వీరేశం గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే స్వయంగా రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ కు సూచించారు. మండపం నిర్మాణానికి పూనుకున్న ఆంజనేయులు ను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, నాయకులు పోకల దేవదాసు, జడల చిన్న మల్లయ్య, వనమా వెంకటేశ్వర్లు, పందిరి శ్రీనివాస్, పాటి మాధవరెడ్డి, ఎద్దులపురి కృష్ణ, బొబ్బల రామ్ రెడ్డి, గుడిపాటి లక్ష్మీనరసయ్య, బెల్లి సత్తయ్య, గుండెబోయిన సైదులు, ఏళ్ల చంద్రశేఖర్, పందిరి రమేష్, కుక్కల మోహన్, జెర్రీపోతుల సత్యనారాయణ, సిల్వేరు మౌనిక శేఖర్, కొసనం అశోక్, కోనేటి ఎల్లయ్య, మల్లయ్య గౌడ్, బూరుగు కృష్ణ, దాసరి నరసింహ, శ్రీశైలం, రెముడాల మధు, రావుల విజయభాస్కర్ రెడ్డి, పోషబోయిన నరసింహ, కొల్లోజు శ్రీనివాస్, ఆలయ కమిటీ డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, రుద్రారపు లింగస్వామి, వరకాంతం నరసింహారెడ్డి, జిట్టా సాయిలు, వనమా నిఖిల్ కుమార్, అర్చకులు, మహిళలు పాల్గొన్నారు.
