Friday, April 3, 2026
Homeనల్లగొండGraduation Day | నారాయణ హై స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

Graduation Day | నారాయణ హై స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

  • విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికి నాంది

జనగామ పట్టణంలోని నారాయణ హై స్కూల్ “ఈ ఛాంప్స్” విభాగంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ ఫర్హాన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు తమ ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఉన్నత విద్య దిశగా అడుగులు వేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జోన్ డీజీఎం రిజ్వాన్ ఇమ్రాన్, ఈ కిడ్స్ ఆర్ అండ్ డి హెడ్ స్వాతి లక్ష్మి పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి పునాది అని, ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధన వంటి విలువలను పెంపొందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ డే వంటి వేడుకలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు భవిష్యత్ లక్ష్యాల వైపు దృష్టి సారించేందుకు ప్రేరణనిస్తాయని తెలిపారు.

- Advertisement -

విద్యార్థులకు ప్రత్యేకంగా క్యాప్, గౌన్ ధరింపజేసి పట్టభద్రులుగా సత్కరించారు. అనంతరం ఒక్కొక్కరికి సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిన్నారులు ఆనందోత్సాహాలతో తమ విద్యా ప్రయాణంలో కొత్త దశను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

కార్యక్రమంలో కోఆర్డినేటర్లు సాయి కృష్ణ, శిరీష, శ్యామల, వైస్ ప్రిన్సిపల్స్ శ్రీలేఖ, రేణుక, అకడమిక్ డీన్ విక్రమ్, ఏవోబిఎన్ చారి, అధ్యాపక బృందం చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.

తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పిల్లల విజయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News