- సురక్షిత ఉత్పత్తులు-నమ్మకమైన వినియోగదారులే లక్ష్యం న్యాయ నిపుణుల పిలుపు
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ (యూ.సీ.ఎల్ ) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.సురక్షితమైన ఉత్పత్తులు–నమ్మకమైన వినియోగదారులు అనే నిపుణుల సందేశం తో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్పత్తుల భద్రత,వినియోగదారుల అవగాహన ప్రాముఖ్యతను చెప్పారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు జస్టిస్ డా. ఎస్. రాధారాణి మాట్లాడుతూ ప్రపంచీకరణ,డిజిటల్ మార్కెట్ల నేపథ్యంలో వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యత పెరిగిందన్నారు.ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడం తయారీదారులు,నియంత్రణ సంస్థలు,హక్కుల కార్యకర్తల సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగరం, లా ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ఎన్.వెంకటేశ్వర్లు,యు.సి.ఎల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామ్ ప్రసాద్,డాక్టర్ సి.శివలీల,లు మాట్లాడుతూ…

వినియోగదారుల చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకొని మూట్ కోర్టులు,లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ప్రాక్టికల్ అనుభవం సంపాదించాలని సూచించారు.ఎం.రాజిరెడ్డి,సంతోష్ రంగారావు వినియోగదారుల హక్కుల అమలులో స్వచ్ఛంద సంస్థల పాత్రను వివరించారు.కార్యక్రమ కన్వీనర్ వేముల గౌరీ శంకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
