ఓయూ బిసి జేఏసీ (OU BC JAC) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ (Arts College) ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి (Vakiti Srihari) జన్మదినం (Birth Day) సందర్భంగా కేక్ కట్ (Cake Cutting) చేసి ఘనంగా సంబరాలు (Celebrations) చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఓయూ బీసీ జేఏసీ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వాకిటి శ్రీహరికి 42% బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతు(God)ని కోరుకుంటున్నాం అదేవిధంగా బలహీన వర్గాల (BC) తరపున బలమైన గొంతుకగా ఉండాలని ఆశిస్తున్నాం. వాకిటి శ్రీహరి వెనక రెండున్నర కోట్ల మంది బీసీలు ఉన్నారన్న విషయాన్ని మరవొద్దని ఓయూ బిసి జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్,బోల్లేపల్లి స్వామి గౌడ్, అల్లుడు జగన్ ముదిరాజ్, బైరు నాగరాజు గౌడ్, భీమ్ రావు, కొమ్మానబోయిన సైదులు, కాంపాటి వెంకట్ గౌడ్, శ్రీకాంత్,తిమ్మానగరం వెంకట్, రఘు, చేర్యాల వంశీ,కౌశిక్,విద్యార్థులు పాల్గొన్నారు.
Osmania University | ఘనంగా వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు
By Aadab Desk
- Advertisement -
Previous article
