Friday, February 13, 2026
Homeరంగారెడ్డిMedchal Circle | ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Medchal Circle | ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • బస్తీల్లో జాతీయ జెండా ఆవిష్కరణలు పాల్గొన్న
  • రామన్న గారి రాఘవేందర్ గౌడ్

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ మేడ్చల్ లోని పలు బస్తీలలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా మేడ్చల్ సర్కిల్ పరిధిలోని యువత యువజన సంఘాల ప్రతినిధులు కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ…

మేడ్చల్ సర్కిల్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ స్వాతంత్ర్య సాధనకు ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యువకులు,కార్యకర్తలు, అభిమానులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News