Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Nominations | ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా నామినేషన్ లు

Nominations | ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా నామినేషన్ లు

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో భాగంగా ఐదు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో గోపాల్ పేట మండల పరిధిలో గోపాల్ పేట, తాడిపర్తి బుద్ధారం. పెద్దమందడి మండలంలో పామిరెడ్డిపల్లి, వీరాయిపల్లి గ్రామాల పంచాయతీ కార్యాలయాలో ఏర్పాటుచేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఫారం 01 ప్రచురణ ను తనిఖీ చేసి, కేంద్రాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని సూచించారు.

ప్రతిరోజు నామినేషన్ల ను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్ లో అప్డేట్ చేయాలన్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజల్ మరొక వ్యక్తి మొత్తం ముగ్గురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని ఆదేశించారు. అనంతరం వీరాయపల్లిలో కలెక్టర్ తో పాటు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పాల్గొని నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల అబ్జర్వర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఎక్స్పెండిచర్ బుక్లెట్ ఇచ్చినప్పుడు ధ్రువేకరణ చేసి ఇవ్వాలని సూచించారు. గోపాల్ పేట తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీడీవో అయేషా, పెద్దమందడి తహసిల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో తాళ్ల పరిణత ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News