- గడువు దాటితే కఠిన చర్యలే
- గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం జోరు
- ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ వాగ్దానాలు
- సమయం దాటితే కేసులు తప్పవు
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వారి ప్రచారాన్ని ముమ్మరంగా చేసుకుంటున్నారు. ఈ ఒక్క రోజే కావడంతో వారు ,వారు గ్రామాల్లో తిరుగుతూ ఇచ్చిన హామీలను మరోసారి ప్రజలకు తెలియజేస్తూ న్నారు. మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించండి మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెబుతూ ఓటర్లను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే మీరు మమ్మల్ని భారీ మెజార్ తో గెలిపించండి అంటూ బ్రతిమలాడుతున్నారు.
అంతేకాకుండా వారు వాట్సాప్, స్టేటస్ లలో వారు గ్రామాన్ని ఇలా అభివృద్ధి చేస్తామంటూ చూపెడుతున్నారు. అంతేకాకుండా ప్రచార రథంలో అభివృద్ధిపై పాటల రూపంలో వివరిస్తూ వాడవాడలా వినిపిస్తూ మరికొంద రైతే కళాకారుల ద్వారా పాటల రూపంలో ఓటర్లకు వినిపిస్తున్నారు. ఇన్ని చేసినా గ్రామాల్లోని కొందరు వోటర్లు ఒకచోటగా కలిసి మా చిన్నతనం నుండి ఇప్పటివరకు ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదని వినలేదని చెప్పుకుంటు ముక్కున వేలేసుకుంటున్నారు.
అంతేకాకుండా వీరు ఎన్ని హామీలను ఇస్తున్నారు సరే ఇంత ఖర్చు పెడుతున్నారు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటారా…? లేక పెట్టిన నగదు ఎలా సంపాదించుకోవాలి అని పనిలో ఉంటారా అంటూ గుస గుస లాడుకుంటు ఎవరికి ఓటు వేయాలో తెలియని అయోమయ స్థితిలో ఓటర్లు పడ్డారు. తదనంతరం ఈరోజు ఒక్కరోజే ప్రచారాలకు గడువు ఉండడంతో ఎస్ఐ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో పోలీసు అధికారులు గ్రామ ,గ్రామాన తిరుగుతూ ప్రచారానికి సాయంత్రం వరకే గడువు ఉందని గడువు దాటితే ప్రచారాలు నిర్వహించద్దని తెలియజేసే పనిలో పడ్డారు.ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
