హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు(BC reservations) ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన జీవోని మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నారని సమాచారం. అధికారులు ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసేశారు. జీవో రాగానే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది.
ఈ ఎన్నికల కోసం జిల్లాల అధికారులందరినీ సిద్ధంగా ఉండమని ఆదేశాలు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ నుంచి జీవో వచ్చిన తరువాత పంచాయతీరాజ్ శాఖ దాన్ని అమలు చేయడానికి ఆదేశాలు ఇవ్వనున్నారని సమాచారం.
జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఇంకా వార్డు మెంబర్ల సీట్లను రిజర్వ్ చేసే పనిలో ఉన్నారు. జీవో విడుదలైన వెంటనే, రాజకీయ నాయకులు, మీడియా సమక్షంలో రిజర్వేషన్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత, మహిళలకు కేటాయించిన సీట్లను లాటరీ తీసి నిర్ణయిస్తారు. మొత్తం 31 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవుల్లో 13 బీసీలకు, 5 ఎస్సీలకు, 3 ఎస్టీలకు, మిగిలిన 10 జనరల్ కేటగిరీకి కేటాయిస్తున్నట్టు సమాచారం. ఇందులో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. తెలంగాణలో 565 జెడ్పీటీసీ, 5,763 ఎంపీటీసీ, 12,760 సర్పంచ్ పదవులున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీ రిజర్వేషన్లు(BC reservations) మాత్రం ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వే ఆధారంగా ఖరారు చేస్తారు.
జీవో అధికారికంగా ప్రకటించే వరకు రాజకీయ ఒత్తిళ్లకు వల్ల వివరాలు బయటపెట్టవద్దని అధికారులకు కఠినంగా హెచ్చరించారు. దీపావళి లోపే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. అందుకోసం సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్‌ను కూడా దాఖలు చేయనున్నారు.
మరిన్ని వార్తలు :
కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతలు ధ్వజం
