- అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం
- ఆస్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయిస్తాం..
- ఆదాబ్తో తహశీల్దార్ పుల్లయ్య
ప్రభుత్వ భూముల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని, ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిపినా సహించబోమని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కొత్త గూడెం తహశీల్దార్ పుల్లయ్య స్పష్టం చేశారు. ఈనెల 19న ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిలో దర్జాగా కబ్జా… కోటి రూపాయల ప్రభుత్వ భూమి ఆక్రమణ, 13వ డివిజన్లో యధేచ్చగా అక్రమ నిర్మాణం, నిర్మాణపనులు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు అంటూ ఆదాబ్ హైదరా బాద్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనానికి స్పం దించిన తహశీల్దార్ శుక్రవారం ఆదాల్కు వివరణ ఇచ్చారు. విలువైన ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిం చాలని చూస్తే సహించబోమని, రెవెన్యూ శాఖ తరపున ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూము లు కబ్జా చేయాలని చూస్తే తాము ఊరుకోమని, వారు ఎంతటి వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 13వ డివిజన్ ఫ్యూన్బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణ పనులు అడ్డుకోని వెంటనే నిలిపివేయించా మని, సదరు వ్యక్తి ఆభూమికి సంబం ధించిన సరైన పత్రాలు రెవెన్యూ కార్యాలయంలో చూపించలేదన్నారు.
తమకు సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్న చోటికి ఆస్ఐలు గణపతి, సూర్యనారాయణలను పంపించి అడ్డుకున్నట్లు తెలిపారు.
ఆభూమిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేయకూడదని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రెవెన్యూయాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటా మని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఆస్థలంలో ఇది ప్రభుత్వ భూమి అని బోర్డును కూడా ఏర్పాటు చేయిస్తా మని తెలిపారు. ఒక వేళ ప్రభుత్వ భూమిలో ఇంటి పనులు చేపడితే నిర్మాణ నిర్ధాక్షీన్యంగా ఆనిర్మాణాలను నిర్మాణ పనులను కూల్చివేయడం జరుగుతుందని ఆయన ఆదాబ్ తెలిపారు.
