Thursday, March 26, 2026
HomeరాజకీయంAnand Kumar Goud | దీక్షా దివస్ విజయవంతం చేద్దాం

Anand Kumar Goud | దీక్షా దివస్ విజయవంతం చేద్దాం

ఈ నెల 29న బీఆర్ఎస్ పార్టీ (Brs Party) కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో నిర్వహించనున్న దీక్షా దివస్‌(Deeksha Diwas)లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోషామహల్ (Goshamahal) బీఆర్ఎస్ పార్టీ నేత ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అధ్యక్షతన నిర్వహించిన దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో నియోజకవర్గ నేతలతో కలిసి పాల్గొన్నారు.

సీనియర్ నేత ఎంఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూపొందించిన దీక్షా దివస్ పోస్టర్‌(Poster)ను తలసాని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దీక్షా దివస్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలను భారీగా తెలంగాణభవన్‌కు తరలించాలని ఆనంద్ కుమార్ గౌడ్‌కు సూచించారు. దీక్షా దివస్‌కు గోషామహల్ నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులను తెలంగాణభవన్‌కు తీసుకొస్తానని ఆనంద్ కుమార్ గౌడ్.. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు హామీ ఇచ్చారు. దీక్షా దివస్ సందర్బంగా గోషామహల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకు తెలంగాణభవన్‌కు చేరుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News