- పోలీస్ శాఖలోకి… యువత ధైర్యంగా ముందుకు రావాలి
- అక్టోబర్ 21 పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా.
- GMR పోలీస్ ట్రైనింగ్ కాలేజీ క్యాంప్ కమాండెంట్ కిక్కర గోపిశంకర్ యాదవ్.
దేశానికి, సమాజానకి.. సేవ చేయడం ఒక అదృష్టమని, పోలీస్ యూనిఫాం లో ఒక తెలియని శక్తి ఉంటుందని, యువతకి పోలీస్ యూనిఫాం అంటే క్రేజ్ అని గోపీ శంకర్ చెప్పారు. మన కోసం అమరులైన జవాన్లు మన రేపటి కోసం వారి నేటిని త్యాగం చేశారని అన్నారు. వారి త్యాగం వృధా పోలేదని… ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది అని… తెలియ జేశారు… ఇదే స్ఫూర్తి తో.. గోపి శంకర్ 2000 సం లో సురక్ష అకాడమీ ఆఫ్ పోలీస్ అనే సంస్థ ను స్థాపించి దీని ద్వారా ఈ 25 సం” ల లో 800 కు పై గా సబ్- ఇన్స్పెక్టర్ ల ను 10 వేల కు పైగా కానిస్టేబుళ్ల ను దేశ సేవ కొరకు అందించా మన్నారు. యువత చెడు అలవాట్లకు స్వస్థి చెప్పి సీరియస్ గా పోలీస్ సెలెక్షన్ కొరకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు.
