Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిJawahar Nagar | గోల్డ్ స్మిత్ అదృశ్యం ఘటన

Jawahar Nagar | గోల్డ్ స్మిత్ అదృశ్యం ఘటన

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డ్ స్మిత్ అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ నగర్ వికలాంగుల కాలనీకి చెందిన బూరుగు సత్యనారాయణ (28) వికలాంగుల కాలనీలో సోదరుడు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. సత్యనారాయణ బాలాజీ నగర్ లో గోల్డ్ వర్క్ షాప్ లో గోల్డ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ నెల 26వ తేదీన ఉదయం 9 గంటలకు గోల్డ్ షాప్ కు వెళ్లిన సత్యనారాయణ తిరిగి ఇంటికి రాలేదు. గతంలో కూడా సత్యనారాయణ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి రెండు మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈసారి వెళ్లిన తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువుల వద్ద తెలిసిన వారి వద్ద వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ మేరకు తల్లి సంజీవమ్మ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News