Wednesday, March 4, 2026
Homeబిజినెస్Gold And Silver | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold And Silver | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలే కారణం..
  • అమెరికాలో భగ్గుమన్న ద్రవ్యోల్బణం..!

గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర మంగళవారం ఒక దశలో 5 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. చివరకు 225 డాలర్లు కోల్పోయి 5,088 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. అలాగే వెండి కూడా ఐదు శాతం తగ్గి 82 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది.

దీంతో దేశీయంగా పదిగ్రాముల గోల్డ్‌ ధర రూ.1.69 లక్షలకు పడిపోనుండగా, కిలో వెండి రూ.3 లక్షల దిగువకు చేరుకోనున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అమెరికాలో మరోసారి ద్రవ్యోల్బణం భగ్గుమనే అవకాశాలుండటంతో ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ధరలు తగ్గడానికి మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News