ఈ రోజు 11.01.2026 సాయంత్రం సుమారు 17:30 గంటలకు యాప్రాల్‌కు చెందిన శివ కుమార్ నుండి 100 డయల్ కాల్ అందింది. ఆర్మీ కార్గిల్స్ సమీపంలోని అటవీ ప్రాంతంలో సహజ అవసరాల కోసం వెళ్లిన సమయంలో సుమారు ఒకటిన్నర సంవత్సరాల వయస్సు గల బాలిక నేలపై పడివున్నట్లు ఆయన గుర్తించినట్లు సమాచారం ఇచ్చారు.
బాలిక నుదిటి భాగంలో స్వల్ప గాయాలు ఉండగా కడుపు భాగంలో గాయాల ఆనవాళ్లు కనిపించాయి. నోటి భాగం కొంత మేర దెబ్బతిన్నట్లు తెలిపారు. మృత బాలిక ఎరుపు రంగు టీ షర్ట్, ఎరుపు రంగు ట్రాక్ ప్యాంట్, నీలం రంగు జెర్కిన్ ధరించి ఉంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మోర్ట్యువరీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు జవహర్ నగర్ ఫోన్ నెంబర్ 8712662097కు లేదా అడ్మిన్ ఎస్ ఐ రాము ఫోన్ నెంబర్ 8712662103కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
