Wednesday, February 25, 2026
Homeహైదరాబాద్‌GHMC | ముగింపు దశకు చేరుకున్న జిహెచ్ఎంసి పాలకమండలి

GHMC | ముగింపు దశకు చేరుకున్న జిహెచ్ఎంసి పాలకమండలి

  • విభజన సంకేతం రెండు డివిజన్ లైన మెట్టుగూడ,చిలకలగూడ
  • ఈసారి మెట్టుగూడ డివిజన్‌ జనరల్ స్థానం అయితుందని ఎదురుచూస్తున్న ఆశావాహులు
  • ప్రజా సేవకి సిద్ధమౌతున్న వ్యాపారి ధారబోయిన కుటుంబం
  • సంప్రదింపులు షురూ ఏ పార్టీ టికటిస్తుందో వేచి చూడాలి గురు

ఫిబ్రవరి 8వ తేదీన ప్రస్తుత జిహెచ్ఎంసి పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది.ఇదే సమయంలో డి లిమిటేషన్ పునర్విభజన ప్రకటన రావడంతో రాజకీయ పార్టీల మధ్య సంప్రదింపులు,సమీకరణాలు జోరుగా సాగుతున్నాయి.డివిజన్ల సంఖ్య పెంపుతో పాటు రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయని ప్రజాపాలన ప్రభుత్వం ప్రకటించడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.డి లిమిటేషన్ పునర్విభజనలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెట్టుగూడ,అడ్డగుట్ట డివిజన్లు ఇప్పటివరకు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలుగా ఉండగా,తార్నాక,సీతాఫల్మండి, బౌద్ధనగర్ జనరల్ స్థానాలుగా కొనసాగాయి.

అయితే ఐదు డివిజన్లలో అతి తక్కువ ఓటర్లు కలిగిన మెట్టుగూడ డివిజన్‌ను తాజాగా రెండు డివిజన్లుగా విభజించడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.దీంతో ఈసారి మెట్టుగూడ డివిజన్ జనరల్ స్థానంగా మారే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.మెట్టుగూడ డివిజన్ జనరల్ సీటుగా మారే అవకాశంతో బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుంచి అనేకమంది వ్యాపార రంగంలో స్థిరపడ్డ వారు ఆశావహులు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

- Advertisement -

క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉన్న ఈ డివిజన్‌లో ద్వితీయ తృతీయ స్థానంలో రైల్వే కార్మికులు,బీసీ ఓటర్లు కడిగి ఉండడంతో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మెట్టుగూడలో పుట్టి పెరిగిన స్థానికుడు దారబోయిన శ్రీనివాస్ యాదవ్ రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.

వ్యాపార రంగంలో స్థిరపడిన ఆయన,ఉమామహేశ్వర దేవాలయం ట్రస్ట్ చైర్మన్‌గా సేవలందిస్తూ అన్ని పార్టీల నేతలు,కార్యకర్తలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారని సమాచారం.పార్టీ కంటే ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగా పేరొందిన శ్రీనివాస్ యాదవ్‌కు ఏ పార్టీ నుంచి అవకాశం వచ్చినా ప్రజాసేవలో ముందుండేందుకు సిద్ధంగా ఉన్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.మరోవైపు బీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యం కలిగిన సీనియర్ నేత ర్యాల రాజేందర్ యాదవ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలో పాల్గొనడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News