- జియాగూడ స్లాటర్ హౌజ్ ఆధునికీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి
- స్లాటర్ హౌజ్ తనిఖీ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఆదేశం
జియాగూడ స్లాటర్ హౌజ్ ఆధునికీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మంగళవారం కార్వాన్ సర్కిల్‌లోని జియాగూడ కమేళా స్లాటర్ హౌస్‌ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజనీర్ (మెయింటెనెన్స్) సహదేవ్ రత్నాకర్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ లతో కలసి తనిఖీ చేశారు.





స్లాటర్ హౌస్ ఆధునికీకరణ కు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున త్వరగా టెండర్లను పిలిచి పనులను త్వరగా ప్రారంభం అయ్యేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఉండేలా చూడాలని కమిషనర్ ప్రాజెక్టు ఇంజినీర్లకు ఆదేశించారు. పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజారోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, నిర్మాణ వ్యర్థాలు తక్షణమే తొలగించాలని, శుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.