ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా(Konaseema District) మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామం(Irusumand Village)లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) బావి(Mori-5) నుంచి గ్యాస్ లీక్ అయింది. పైప్‌లైన్(Pipeline)లో లీక్ వల్ల పెద్దఎత్తున మంటలు(Blaze), దట్టమైన పొగ చెలరేగాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. ఫైర్‌ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖ(Fire Safety) సిబ్బంది, పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ గాయాలు కావటం గానీ జరగలేదు. మంటలు 100 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఫలితంగా వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు(Coconut Trees) కాలిపోయాయి. ఓఎన్‌జీసీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి 5 కిలోమీటర్ల లోపు ఇళ్లల్లో ఉన్న స్థానికులు ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. మోరీ-5 అనే గ్యాస్ బావిని దీప్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఏడాది కాలంగా నిర్వహిస్తోంది.
Gas Leak | కోనసీమలో గ్యాస్ లీక్
- Advertisement -
RELATED ARTICLES
