G20 సదస్సు దక్షిణాఫ్రికా(South Africa)లోని జొహన్నెస్‌బర్గ్(JOHANNESBURG)లో శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాయ్‌కాట్(Boy Cotting) చేశారు. దక్షిణాఫ్రికా ప్రాధాన్యతలు (ముఖ్యంగా.. వాణిజ్యం, వాతావరణ చర్యలపై ప్రపంచ సహకారాన్ని పెంచడం) అమెరికా విధానానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో G20 సదస్సును బహిష్కరించారు.
ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోదీ (PM Modi), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, చైనా ప్రధాని లీ కియాంగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తదితరులు హాజరవుతున్నారు. G20 అనేది 19 దేశాలతోపాటు యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ సమూహం. ప్రపంచ GDPలో 85 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల ప్రాతినిధ్యం వహిస్తోంది.
