Saturday, April 4, 2026
Homeసాహిత్యంMotivation | యాగ ఫలం

Motivation | యాగ ఫలం

పువ్వుల్ని నలిపితేనే..
సువాసనల సుగంధ ద్రవ్యాలు
ద్రాక్షను క్రష్‌ చేస్తేనే..
రుచికరమైన మద్యం !

నిమ్మను కోసి పిండితేనే..
ఆరోగ్యకర రసం లభిస్తుంది
పండ్లను కోసి ముక్కలు చేస్తేనే..
తియ్యని రుచుల విందులు !

- Advertisement -

ఇంధనం మండితేనే..
శక్తి ఊటల వరదలు
బియ్యం ఉడికితేనే..
చేతిలో అన్నం ముద్ద !

నిశ్శబ్దంగా విత్తనం..
పెరిగి పెద్ద వృక్షం అవుతుంది
చెట్టు నరికితే..
భీకర శబ్దంతో కూలుతుంది !

నిశ్శబ్దంగా ఎదగడం..
విస్పొటన శబ్దంతో పతనం
మాటల కత్తుల గాయాలు..
మౌనం మానసికోల్లాసం !

చెమట కక్కితేనే…
లక్ష్య సాధన సులువు
అడుగు పడితేనే..
గమ్యం దరి చేరును !

కష్టపడితేనే..
సుఖ జీవన అర్హతలు
త్యాగం చేస్తేనే..
యాగ ఫలం సిద్ధిస్తుంది !

- Advertisement -
RELATED ARTICLES

Latest News