ఫ్రెంచ్ అధ్యక్షుడు(French President) ఇమ్మాన్యుయేల్ మెక్రాన్(Emmanuel Macron) ప్రజాదరణ(Popularity) అత్యల్ప స్థాయికి చేరుకుందని ఓ సర్వే తేల్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పాపులారిటీ తగ్గుకుంటూ వస్తోందని పేర్కొంది. మెక్రాన్‌తోపాటు ఈ సంవత్సరం ఫ్రాన్స్‌లోని రాజకీయ నాయకులందరి ప్రజాదరణ తగ్గిందని పోల్ తెలిపింది. తొలిసారి 2017లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రజాదరణ అట్టడుగు స్థాయికి చేరుకుందని పేర్కొంది. మెక్రాన్ ఈ సంవత్సరాంతపు సందేశాన్ని అందించడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఈ వార్త వెలువడటం చర్చనీయాంశంగా మారింది.
కేవలం పాతిక శాతం మంది ఫ్రెంచ్ ప్రజలు మాత్రమే మెక్రాన్‌కి అనుకూలంగా ఉన్నారు. మెక్రాన్ అనుసరిస్తున్న విదేశీ విధానాలను బట్టి కాకుండా ఆయన చేస్తున్న దేశీయ రాజకీయాల ఆధారంగానే ప్రజలు ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోందని సర్వే నిర్వచించిన ఎల్‌సీఐ న్యూస్ ఛానల్ నిర్వాహకులు తెలిపారు. సర్వేలో 1.4 నుంచి 3.1 శాతం వరకు దోషాలు ఉండొచ్చని చెప్పారు. మెరైన్ లె పెన్‌కి చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ(National Rally Party)కి నాయకత్వం వహిస్తున్న జోర్డాన్ బార్డెల్లా (Jordan Bardella) 42 శాతం అనుకూల అభిప్రాయాలతో అగ్రస్థానంలో నిలిచాని వెల్లడించారు.
