నిజాంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేత, లీల గ్రూప్ చైర్మన్ (Leela Group Chairman) మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్.. వెంకటాపూర్, వెంకటాపూర్ తాండ గ్రామ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వారి ఆరోగ్య సమస్యలను (Health Problems) అడిగి తెలుసుకొని, పరిష్కారం దిశగా సలహాలు సూచనలు అందించారు. మందులను (Medicines) కూడా ఫ్రీగానే పంపిణీ చేశారు. 550 మందికి పైగా స్థానికులు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. గొప్ప సేవ చేస్తున్న ఇలాంటి నాయకుడే (Leader) తమకు కావాలంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, లీలా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
