Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Kuppam | కుప్పంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

Kuppam | కుప్పంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

సొంత నియోజకవర్గం కుప్పంలో పలు ప్రాజెక్టుల(Projects)ను సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల (Industries) స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఎస్ఐపీబీల (SIPB) ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం తెలుపుతున్నామని వెల్లడించారు. స్పేస్ సిటీ (Space City), డ్రోన్ సిటీ(Drone City), ఎరో స్పేస్ (Aero Space) సిటీలను ఏర్పాటుచేయబోతున్నామని ప్రకటించారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే..

- Advertisement -

డ్వాక్రా (Dwcra) వ్యవస్థను ప్రారంభించాం. ఇప్పుడు ఆ వ్యవస్థ పెద్ద ఎత్తున ఆర్థిక కార్యాకలాపాలు నిర్వహించగలుగుతోంది. మెరుగైన జీవన ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలి. ఒకప్పుడు కుప్పం అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E–Royce EV, ALEAP మహిళా పార్క్ వచ్చాయి. ఒకే రోజు ఏడు సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. కుప్పంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాం. హిందాల్కో సంస్థ మొబైల్, ల్యాప్‌టాప్, టెక్ పరికరాల భాగాల తయారీలో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కుప్పంలో రూ.586 కోట్లు పెట్టుబడి పెడుతోంది.

ఆదిత్య బిర్లా సంస్థ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తుంది… దీని వల్ల స్థానిక యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. శ్రీజా డైరీ.. సమీకృత డెయిరీ, పశువుల మేత ప్లాంటును. రూ.290 కోట్లతో ప్రాజెక్టు చేపడుతోంది. మహిళలకు ఉపాధి, పాడి రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది. నాలుగు లక్షల లీటర్లను శ్రీజా డెయిరీ కొనుగోలు చేస్తుంది.. అలాగే స్థానిక పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ… డెయిరీ ప్రోటీన్ తయారీలో ప్రపంచ ప్రమాణాలను పాటించే సంస్థ. ఎగుమతుల హబ్‌గా కుప్పాన్ని తీర్చిదిద్దే స్థామర్ధ్యం ఈ సంస్థకు ఉంది. గ్రీన్ ఫీల్డ్ డెయిరీ ఉత్పత్తుల కాంప్లెక్స్‌ను రూ.525 కోట్లు పెట్టుబడితో స్థాపించేందుకు కుప్పానికి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News