నల్లగొండ జిల్లా (Nalgonda District) మిర్యాలగూడ (Miryalaguda) నియోజకవర్గంలో రూ.74 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (VenkatReddy) శంకుస్థాపన చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), ఎంపీ రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy), స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(Bathula Laxma Reddy), ఎమ్మెల్సీ శంకర్ నాయక్ (Shankar Nayak) పాల్గొన్నారు. మంత్రులను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతించారు. నియోజకవర్గంలోని ప్రతి రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో కేఎన్ఎం డిగ్రీ కాలేజీని ప్రభుత్వపరం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, అభివృద్ధి కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Komatireddy | అభివృద్ధి పనులకు శంకుస్థాపన
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
