భూపాలపల్లి నియోజకవర్గం(Bhupalapally Constituency)లోని రేగొండ మండల(Regonda Mandal) కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న కొత్త బస్ స్టేషన్(New Bus Station)కి రవాణా శాఖ మంత్రి(Transport Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సోమవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మునిసిపాలిటీలోని కృష్ణ కాలనీ, యాదవ కాలనీలకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనుల(Protection Wall Construction Works)కు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం.. మధర్ థెరిస్సా పట్టణ సమాఖ్య మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కును అందించారు.
