మాజీ ఎమ్మెల్యే (Ex Mla) ఇంట్లో పేకాడుతూ రాజకీయ ప్రముఖులు (Political Leaders) పట్టుబడిన ఘటన వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు (Donepudi Ramesh Babu) ఇంట్లో కొందరు పేకాడుతున్నట్లు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు, వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన గూడూరు హరిబాబు, కాజీపేట ప్రాంతానికి చెందిన వలుపదాసు సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్‌రోడ్డు శాయంపేట ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, మామునూరు ప్రాంతానికి చెందిన నోముల తిరుపతిరెడ్డి, గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన రావర్ల శ్రీనివాసరావు, సయ్యద్ జావీద్, కొత్తవాడకు చెందిన నీలం రాజ్‌కిశోర్ తదితరులు ఉన్నారు.
Ex Mla | పేకాటాడుతూ దొరికిన మాజీ ఎమ్మెల్యే
RELATED ARTICLES
- Advertisment -
