రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో హోలీ కొత్త ఆశలు, విశ్వాసాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరి నడుమ ప్రేమాభిమానాలను విరజిమ్మే రంగుల పండుగగా, హోలీ పండుగ భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకున్నది అని కేసీఆర్ అన్నారు.
ఆకులు రాలే శిశిరం నుంచి కొత్త చిగురులు తొడిగే వసంతానికి బాటలు వేస్తూ, ప్రకృతిలో నూతనత్వానికి సూచకంగా హోళీ నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఆశలు అడుగంటి ఉన్న తెలంగాణ ప్రజల్లో, కొత్త ఆశలు విశ్వాసాలు తిరిగి పుంజుకోవాలని, ప్రజల నడుమ మరింతగా సహోదరతత్వం పెంపొందాలని హోలీ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు.
- Advertisement -
