Wednesday, February 11, 2026
Homeక్రైమ్ వార్తలుషార్ట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం

మానవత్వం చాటుకున్న మాజీ చైర్మన్ చంద్రారెడ్డి

నాగారం మున్సిపాలిటీ లోని వెస్ట్ గాంధీనగర్ రోడ్ నెంబర్.1 కు చెందిన మాటేల మమతా రేకుల ఇళ్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న వస్తువులు, సామాన్లు కాలిపోయాయి. ఈ సంఘటన తెలుసుకున్న నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి విచారణ వ్యక్తం చేస్తూ మానవతా దృక్పథంతో స్వంత నిధులు రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక సాయంపై బాధిత కుటుంబసభ్యులు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారని కొనియాడుతూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News