రాత్రి పూట ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావట్లేదా? తెల్లవారుజామున(Early Morning) మూడు నాలుగు గంటల వరకు మెలకువతోనే ఉంటున్నారా? ఇదే మీ సమస్య(Problem) అయితే మీ ఆరోగ్యం(Health) మరింత ప్రమాదం(Danger)లో పడుతుందని మర్చిపోవద్దు. ఈ ఇబ్బంది నుంచి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు(Care) తీసుకుంటే సరిపోతుంది. అవేంటంటే.. పడుకునే ముందు ఫోన్లు పక్కన పెట్టాలి. డైలీ ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించాలి. బెడ్ రూమ్‌లో వాతావరణం (Atmosphere in Bedroom) నిద్ర వచ్చేందుకు అనుకూలంగా ఉండాలి. టెంపరేచర్, లైటింగ్, సౌండ్ వంటివి తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. గది ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 22 డిగ్రీల వరకు ఉంటే చాలు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముంచెత్తే ఆలోచనలతో ఆందోళన చెందొద్దు. రేపటి షెడ్యూల్‌ని ఫిక్స్ చేసుకొని పడుకుంటే నిద్ర తేలిగ్గా వస్తుంది. కషాయాలను తాగితే నిద్రపడుతుంది. పగటి సమయంలో.. టీలు, కాఫీలు ఎక్కువగా తాగకూడదు. ఫ్రూట్స్ తినాలి.
